తెలుగు రాష్ట్రాల్లో ‘ఫోన్ ట్యాప్’ పాలిటిక్స్! టార్గెట్ వారే?

by Disha Web Desk 14 |
తెలుగు రాష్ట్రాల్లో ‘ఫోన్ ట్యాప్’ పాలిటిక్స్! టార్గెట్ వారే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాప్ పాలిటిక్స్ కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై చర్చ జరుతున్నది. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలో కూడా ఫోన్లు ట్యాప్ చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టులే టార్గెట్ ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో గతం నుంచే అప్పటి బీఆర్ఎస్ ఫోన్ ట్యాప్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తన ఫోన్ ట్యాప్ చేశారని మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గతంలో సంచలన ఆరోపణలు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ అంటే?

అనుమతి లేకుండా మరొకరి సంభాషణ వినడం లేదా చదవడం వంటివి చేస్తే దానిని ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఉదాహరణకు.. మీరు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతుంటే మూడో వ్యక్తి మీ ఇద్దరి సంభాషణను రికార్డ్ చేస్తే లేదా చదివినట్లయితే ట్యాపింగ్ చేయడమంటారు.

ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు..?

రాష్ట్రాల పరిధిలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇక కేంద్రం పరిధిలో చూస్తే.. ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ, సీబీడీటీ, డీఆర్ఐ, డైరెక్ట‌రేట్ ఆఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్‌, ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌రేట్‌ వారు ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంటుంది.

టీఎస్‌లో సస్పెండెడ్ డీఎస్పీ ప్రణిత్ రావు కేసు

తెలుగు రాష్ట్రాల్లో తాజాగా ఫోన్ ట్యాపింగ్ సంచలనంగా మారింది. తెలంగాణలో సస్పెండెడ్ డీఎస్పీ ఫ్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణ ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుతోపాటు అదనపు ఎస్పీలు భుజంగ్ రావు, తిరుపతన్నలను పోలీసులు ఆదివారం కొంపల్లిలోని జడ్జి నివాసంలో హాజరు పరిచారు. అనంతరం చంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రణీత్ రావు తన టీంతో కలిసి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే ఎస్ఐబీలోని తన ఆఫీస్‌లో ఉన్న కంప్యూటర్లలోని డేటాను చెరిపి వేయటంతోపాటు హార్డ్ డిస్కులను ధ్వంసం చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఈనెల 13న ప్రణీత్ రావును అరెస్టు చేశారు.

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌పై ఈసీకి లెటర్

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని టీడీపీ నేత కోటం రెడ్డి శ్రీ రెడ్డి ఆరోపించారు. ఏడాది క్రితమే ఈ వ్యవహారాన్ని తాను బయటపెట్టానని ఆయన తెలిపారు. నెల్లూరులో ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నేతల ఫోన్ల ట్యాపింగ్‌పై విచారణ చేయిస్తామని కోటంరెడ్డి హెచ్చరించారు. ఈ క్రమంలోనే సార్ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. చర్యలు తీసుకోండి.. అంటూ ఈసీకి ఏపీ టీడీపీ నేతలు తాజాగా లేఖ రాశారు. కొన్ని రోజులుగా కొందరు అధికారులతో కలిసి వైసీపీ నేతలు తమ ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫోన్ల ట్యాప్‌పై ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. కాగా కొందరు ఐపీఎస్ అధికారులు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని టీడీపీ నేతలు బోండా ఉమ, చిన్ని ఆరోపించారు. అంతేకాదు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. శనివారం జరిగిన టీడీపీలో సమావేశం ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను పట్టుకున్నారు. దీంతో తమ ఫోన్లను కొందరు ఐపీఎస్ అధికారులు ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story