ఎవరొచ్చినా హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసి గొంతు కోస్తారు.. ఆలోచించి ఓటు వేయండి: KCR విజ్ఞప్తి

by Anjali |
ఎవరొచ్చినా హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసి గొంతు కోస్తారు.. ఆలోచించి ఓటు వేయండి: KCR విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఖర్గే లాంటి వ్యక్తి అలా మాట్లాడటం కంటే దురదృష్టం ఇంకొకటి ఉండదని కేసీఆర్ అన్నారు. నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మాట్లాడారు. హైదరాబాదును సెకండ్ రాజధాని చేస్తే బాగుంటదా? అని విలేఖరి ప్రశ్నించగా.. కేసీఆర్ ఘాటైన సమాధానం ఇచ్చారు. ఖర్గే అలా మాట్లాడటం సరికాదన్నారు. ఇన్ని రోజులు ఢిల్లీకి మోసిన ఖర్గే నాకు హైదరాబాదు దగ్గరైతది అని మాట్లాడి.. హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసి గొంతు కోస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గేనే అలా మాట్లాడాడంటే వీళ్లు ఎవరొచ్చినా హైదరాబాద్‌ను దెబ్బ కొడతారని అన్నారు. హైదరాబాదు మనది మన సొంతం.. దాన్ని ఎన్నటికైనా అట్ల పోనియ్యమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయండి అని.. అలాంటి పిచ్చివాళ్లకు స్థానం ఇవ్వొద్దని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనాలకు విజ్ఞప్తి చేశారు.

Read More..

ప్రధాని రేసులో ఉంటా.. మరోసారి మనసులో మాట చెప్పేసిన KCR

Next Story

Most Viewed