విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు గుండాగిరి మానుకోవాలి.. పీడీఎస్యూ డిమాండ్

by Dishafeatures2 |
విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు గుండాగిరి మానుకోవాలి..  పీడీఎస్యూ డిమాండ్
X

దిశ , తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఛలో సెక్రెటేరియేట్ కు పిలు కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులపై దాడికి పాల్పడ్డ డీసీపీ వెంకటేశ్వర్లును వెంటనే సస్పెండ్ చేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మహేష్, ఎస్.వి.శ్రీకాంత్ లు బుధవారం ఒక ప్రకటన చేశారు.

ఛలో సెక్రటేరియట్ నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ నాయకులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తూ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ పై దాడి చేయడాన్ని పీడీఎస్యూ రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండించింది. విద్యార్ధి నాయకుల పై ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, దాడి చేసిన డీసీపీ వెంకటేశ్వర్లును డిస్మిస్ చేయాలని , లేని పక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.

పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ, దాడి చేయడమే ఫ్రెండ్లీ పోలీసింగా అని ప్రశ్నించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థి సంఘాలు ఏ చిన్న నిరసన, ఆందోళన కార్యక్రమం నిర్వహించినా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం, రోజుల తరబడి పోలీస్ స్టేషన్ లలో నిర్భందించడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఇకనైనా పోలీసులు ఇలాంటి విధానాలు మానుకొని ప్రజాస్వామికంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు .



Next Story

Most Viewed