సీఎంతో భేటీకి పట్నం దూరం.. పాల్గొన్న ఎమ్మెల్యేలు

by Dishafeatures2 |
సీఎంతో భేటీకి పట్నం దూరం.. పాల్గొన్న ఎమ్మెల్యేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వికారాబాద్ జిల్లాలో మరోసారి గ్రూపు రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. కేసీఆర్ జిల్లా పర్యటన పురస్కరించుకొని ప్రగతి భవన్‌లో నిర్వహించిన భేటీకి పట్నం మహేందర్ దూరంగా ఉన్నారు. జిల్లాకు చెందిన మంత్రితో పాటు ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. దీంతో మరోసారి అసంతృప్తి తెరమీదకు వచ్చింది. ప్రగతి భవన్ నుంచి ఆహ్వానం అందలేదనా? లేకుంటే పార్టీ జిల్లా ఎమ్మెల్యేలపై అసంతృప్తితోనా అనేది పార్టీలో చర్చనీయాంశమైంది.

వికారాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. సీఎం పర్యటన సంధర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తుండటం, అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. వికారాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గురువారం సీఎంతో భేటీ అయ్యారు. సభ విజయవంతంతో పాటు జిల్లాల రాజకీయాలను, గ్రూపులను కూడా చర్చించినట్లు సమాచారం.

మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నప్పటికీ ఎమ్మెల్సీ మహేందర్ మాత్రం గైర్హాజరయ్యారు. ఈ భేటీ పార్టీలోని గ్రూపు రాజకీయాలను మరోమారు స్పష్టం చేశాయి. కావాలనే పార్టీకి దూరంగా ఉంటున్నారా? లేకుంటే ఎమ్మెల్యేలతో పొసగకనా? లేకుంటే ఆధిపత్యం తగ్గుతుందానా? అనేది పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పట్నంతో పాటు ఆయన భార్య వికారాబాద్ జడ్పీ చైర్మన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి సైతం గైర్హాజరయ్యారు. దీంతో పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

గత నెలలో జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ వాహనంపై ఎమ్మెల్యే ఆనంద్ అనుచరుల దాడి హాట్ టాపిక్‌గా మారింది. అభివృద్ధి పనుల్లో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ దాడి చేసిన విషయం విధితమే. దీంతో ఆనంద్ కావాలనే కారుపై దాడి చేయించాడని, చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, వ్యవహార శైలి మార్చుకోవాలని, ప్రొటోకాల్ ఎలా పాటించాలో మాకు తెలియదా? మాకు ప్రజల మద్దతు ఉందని జడ్పీ చైర్మన్ మండిపడ్డారు.

ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో సైతం పట్నంకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ ఘటనలతోనే పట్నం భేటీకి దూరమైనట్లు సమాచారం. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీలో ఇమడలేకపోతున్నారా? పార్టీ మారుతారా? అనే చర్చ సైతం జోరుగా సాగుతోంది.

కలిసి పనిచేయాలని సీఎం సూచన

వికారాబాద్ జిల్లాల్లో అందరూ కలిసి కట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో సైతం విజయకేతనం ఎగురవేయాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. జిల్లా పర్యటన విజయవంతానికి నిర్వహించిన సమావేశానికి మంత్రి సబితా, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో పాటు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్, కాలే యాదయ్య హాజరయ్యారు. భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తీసుకురావాలని సూచించినట్లు సమాచారం.

సీఎం కేసీఆర్‌కు అల్లం నారాయణ కృతజ్ఞతలు



Next Story

Most Viewed