పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి రిక్త‘హస్తం’! లోక్ సభ ఎన్నికల్లోనూ దక్కని టికెట్

by Ramesh N |
పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి రిక్త‘హస్తం’! లోక్ సభ ఎన్నికల్లోనూ దక్కని టికెట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అదిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుని పేర్లు ఫైనల్ చేస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 36 క్యాండిడేట్లతో కూడా ఫస్ట్ లిస్ట్‌ను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను 4 పేర్లను ప్రకటించింది. జహీరాబాద్ స్థానం నుంచి సురేష్ షెట్కార్, మహబూబాబాద్‌లో పేరిక బలరాం నాయక్, చేవెళ్ల సునీతా మహేందర్ రెడ్డి, నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డిని అధిష్టానం ఫస్ట్ లిస్ట్‌లో పేర్లను ప్రకటించింది.

అసెంబ్లీ ఎన్నికల్లోనూ నిరాశే..

ఈ నల్లగొండ టికెట్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ పటేల్ రమేష్ రెడ్డి ఆశించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన రెబల్‌గా పోటీ చేయాలని, పార్టీ మారాలని పెద్ద డ్రామా నడిచింది. కానీ, నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయన ఇంటికి వెళ్లి, మొత్తం ఫ్యామిలీ ముందు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు నల్గొండ లిస్ట్‌లో ఆయన పేరు మాత్రం రాలేదు. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ ఇచ్చి నల్గొండ ఎంపీ టికెట్ జానారెడ్డి కొడుకు అయిన రఘువీర్ రెడ్డికి కేటాయించారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ మరోసారి మొండి చేయే చూపించింది. ఈ క్రమంలోనే ఆయనకు మరోసారి నిరాశే మిగిలింది.

ఆయన పార్టీ మారుతారా?

టికెట్ ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్ నేతలు ఆయన వేరే ఎంపీ స్థానం కేటాయిస్తారా? లేక ఏదైనా ఎమ్మెల్సీ పదవి లాంటివి కట్టబెడుతారా? అనే పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. హామీ ఇచ్చి కూడా పార్టీ టికెట్ రాకపోవడంతో ఆయన పార్టీ మారుతారా? అనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఎంపీ టికెట్ రాకపోవడంపై పటేల్ రమేష్ రెడ్డి ఏ విధమైన స్టెప్ తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Next Story

Most Viewed