పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి : KTR

by samatah |
పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి : KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : భారత పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. శుక్రవారం పంజాగుట్ట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ఏర్పడిందన్నారు. బోధించు సమీకరించు పోరాడు అనే సిద్ధాంతంతో ముందుకు సాగిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ దయతోనే నేడు మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యామని పేర్కొన్నారు. కుల రహిత సమాజం కోసంకృషి చేస్తున్నామని.. అందులో భాగంగానే గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. దళిత బంధు పథకం అమలు చేస్తున్న దమ్మున్న సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పాలన కొనసాగుతుందని తెలిపారు. ప్రజల కోరిక మేరకు పంజాగుట్ట సర్కిల్ కు అంబేద్కర్ పేరు పెడతామని.. జీవో కూడా జారీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మెహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.

Next Story