దసరా స్పెషల్.. పాలపిట్టను ఎందుకు చూస్తారో తెలుసా?

by Disha Web Desk 2 |
దసరా స్పెషల్.. పాలపిట్టను ఎందుకు చూస్తారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో దసరా పండుగను ఎంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడినా దసరాకు పండక్కి తప్పక సొంతూరు వస్తుంటారు. అంత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండగను జరుపుకుంటారు. దసరా రోజున తప్పక పాలపిట్టను చూడాలని చెబుతుంటారు. ఈ పాలపిట్టను చూసేందుకు ఊరి చివరకు, పొలాలకు వెళ్తుంటారు. అయితే, పాలపిట్టను పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తారు. రాముడు యుద్ధానికి వెళ్లినప్పుడు పాలపిట్ట ఎదురు రావడంతో విజయం సాధించాడని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పాలపిట్ట ఉత్తర దిక్కు నుంచి ఎదురైతే శుభాలు జరుగుతాయని నమ్ముతారు. కాగా, దసరా రోజు సాయంత్రం జమ్మీ ఇచ్చిపుచ్చుకున్న తర్వాత పాల పిట్టను చూడడం ఆనవాయితీగా వస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒడిశా, బిహార్‌లకు కూడా అధికార రాష్ట్రీయ పక్షి పాలపిట్ట.



Next Story

Most Viewed