KTR : పాలన కాదు పీడన : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : పాలన కాదు పీడన : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పాలనా(Congress government) విధానాలపై నిత్యం విమర్శలతో విరుచుకపడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)మరోసారి ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్నది పాలన కాదని..పీడన అని..ప్రజల వేదన అరణ్య రోదన అంటూ విమర్శలు గుప్పించారు. రైతుల చెరబడితిరి పేదల ఇండ్లు కూలగొడ్తిరి..రైతుబంధు ఎత్తేస్తిరి రైతుభీమాకు పాతరేస్తిరని ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేస్తిరి..అమ్మవడిని ఆగం చేస్తిరి..నిరుద్యోగుల ఉసురు పోసుకుంటిరి ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొక్కితిరని విమర్శించారు. హామీల అమలు అడిగిన ఆడబిడ్డలు ఆశాలను అవమానపరిస్తిరని..రాష్ట్ర అధికారిక చిహ్నంలో టీఎస్ టీజీగా చేసి చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగిస్తిరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ బిడ్డలు లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి ..ఆత్మబలిదానాలతో ఉద్యమిస్తున్నప్పుడు.. మీరు సమైక్యవాదుల పంచనచేరి వంచన చేస్తిరని, అధికార అహంకారంతో ఇప్పుడు ఏకంగా అమ్మనే మారిస్తిరని దుయ్యబట్టారు. మీరు చరిత్రను చెరిపేస్తాం అన్న భ్రమలో తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటని..తెలంగాణ అన్నీ గమనిస్తున్నదని..కాలంబు రాగానే కాటేసి తీరుతుందని కేటీఆర్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed