యూజీ, పీజీ చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఓయూ కీలక ప్రకటన

by Disha Web |
యూజీ, పీజీ చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఓయూ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. గతంలో ఓయూ పరిధిలోని కాలేజీల్లో డిగ్రీ, పీజీ చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. డిగ్రీ, పీజీలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు రాసి డిగ్రీ పట్టా పొందే అవకాశాన్ని యూనివర్సిటీ కల్పించింది. దీంతో ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ డిగ్రీ పట్టా పొందొచ్చునని తెలిపింది. ఈ మేరకు వన్ టైం ఛాన్స్‌ను కల్పిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల నిర్వాహకుల వినతి మేరకు అకాడమిక్ స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు విద్యార్థులకు వన్ టైం చాన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2010 నుంచి 2017 విద్యాసంవత్సరం వరకు వివిధ కోర్సులు చదివి ఫెయిల్ అయిన వారికి ఈ అవకాశం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా విద్యార్థులు పేపర్‌కు రూ.10 వేల చొప్పున అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలో వెల్లడించారు. ఎంఈ, ఎంటెక్, ప్రాజెక్టు, వైవాకు రూ.20 వేలను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను https://www.osmania.ac.in. వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అకాడమిక్ స్టాండింగ్ కమిటీ పేర్కొంది.

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed