త్వరలో తెలంగాణలో అంకాలజీ స్పెషల్ నర్సింగ్ స్కూల్: మంత్రి హరీష్ రావు

by Satheesh |
త్వరలో తెలంగాణలో అంకాలజీ స్పెషల్ నర్సింగ్ స్కూల్: మంత్రి హరీష్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో తొలిసారి ఎంఎన్‌జే ఆధ్వర్యంలో ఆంకాలజీ స్పెషల్ నర్సింగ్ స్కూల్ త్వరలో ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం ఎంఎన్‌జే ఆసుపత్రిలో రూ.32 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టం, రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కార్పొరేట్‌లో ఖరీదైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎంఎన్‌జే ఆసుపత్రిలో కేవలం 3 ఓటిలు మాత్రమే ఉండేవి. అవి కూడా దాదాపుగా 60 సంవత్సరాలు క్రితం నిర్మించినవి. కొత్త వాటిని నిర్మించాలనే ఆలోచన గత ప్రభుత్వాలకు రాలేదు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంఎన్‌జే ఆసుపత్రి స్వరూపమే మారిపోయిందన్నారు. ప్రస్తుతం ఎంఎన్‌జేలో ఢిల్లీలోని ఎయిమ్స్ తరహా సేవలు అందుతున్నాయన్నారు. రూ.120 కోట్లతో స్టేట్ కాన్సర్ సెంటర్‌గా ఎంఎన్‌జేను అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం నిమ్స్, ఎంఎన్‌జేలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎముక మూలుగ మార్పిడి (బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్) శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయన్నారు. ప్రైవేటులో రూ.25 లక్షల ఖర్చు అయ్యే బొన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సను పూర్తి ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.



Next Story

Most Viewed