మరోసారి స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం

by Disha Web Desk 12 |
మరోసారి స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం
X

దిశ, డైనమిక్ బ్యూరో : మరోసారి స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి నాసిక్‌ బయల్దేరిన స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి స్పైస్‌ జెట్‌ విమానం ఉదయం 6.20 గంటలకు బయల్దేరింది. సుమారు 30 నిమిషాల ప్రయాణం తర్వాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. దీంతో, విమానాన్ని తిరిగి శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. 3 గంటలకు పైగా సమయం దాటిన మరో విమానం ఏర్పాటు చేయకపోవడం పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గంటల తరబడి వెయిట్ చేయించడంతో అధికారుల తీరుపై విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అధికారుల నుంచి సరైన స్పందన లేదని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత మూడు రోజుల క్రితం కొచ్చి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సౌదీ అరేబీయాలోని జడ్డా నుంచి కోజికోడ్ వెళుతున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విధంగా స్పైస్ జెట్ విమానాల్లో తలెత్తున్న సాంకేతిక లోపాలపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.


Next Story

Most Viewed