ఆర్ఎంపీలు ఆ పని చేస్తే ఇక ఆగమే.. 'ఉక్కుపాదం' మోపనున్న సర్కార్

by Disha Web Desk 19 |
ఆర్ఎంపీలు ఆ పని చేస్తే ఇక ఆగమే.. ఉక్కుపాదం మోపనున్న సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్ఎంపీలపై సర్కార్ ఉక్కుపాదం చూపేందుకు రెడీ అయింది. ఆబర్షన్లు, రూల్స్‌కు విరుద్ధంగా సర్జరీలు, యాంటీ బయాటిక్​ డ్రగ్స్‌ను ఎక్కువగా రాయడం వంటివి చేస్తే చర్యలు తీసుకోనున్నది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైడ్‌లు చేసేందుకు రంగం సిద్ధమైంది. నిబంధనలు ఉల్లంఘించినోళ్లపై క్రిమినల్​చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆరోగ్యశాఖ నుంచి అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆర్ఎంపీలు కేవలం ఫస్ట్​ ఎయిడ్​ చికిత్సకే పరిమితం కావాలని హెచ్చరిస్తున్నారు. అర్హతకు మించి వైద్యం చేస్తేఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదని హెల్త్​ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో ఆర్‌ఎంపీల వైద్యం వికటించి కొందరు మృతి చెందినట్లు సర్కార్​ దృష్టికి వచ్చింది. వీరిలో గర్భిణీలు కూడా ఉన్నారు. ఎక్కువగా ఆబర్షన్లు, శస్త్ర చికిత్సలు ఫెయిల్​ అయ్యాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న సర్కార్.. ఆర్‌ఎంపీలను కట్టడి చేసేందుకు సిద్ధమైంది. ఆయా గ్రామాలకు వైద్యం అందిస్తున్న ఆర్‌ఎంపీల వివరాలను సేకరిస్తున్నది. అంతేగాక వాళ్లు నడిపిస్తున్న క్లినిక్‌లకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయా? లేదా? అనే విషయాలను ఆరా పరిశీలించనున్నది.

1569 ఆసుపత్రులు తనిఖీలు..

రాష్ట్ర వ్యాప్తంగా 1569 ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు జరిగాయి. వీటిలో 81 సీజ్ చేయగా, 416 ఆసుపత్రులకు నోటీసులిచ్చారు. మరో 68 హాస్పిటళ్లకు భారీగా ఫైన్లు విధించారు. మరిన్ని రోజులుల ఈ స్పెషల్ ​డ్రైవ్​ దాడులు కొనసాగనున్నాయి. క్లినికల్ ​ఎస్టాబ్లిష్​మెంట్​ యాక్ట్​ –2020 ప్రకారం రూల్స్​అతిక్రమించినోళ్లపై చర్యలు తీసుకోనున్నారు. ఇక ఇప్పటికే కొనసాగుతున్న ప్రైవేట్​ ఆసుపత్రుల్లో చిన్న లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు రెండు వారాల పాటు అవకాశం ఇవ్వనున్నారు. ఆ లోపు చేయకపోతే సీజ్​చేయడంతో పాటు కేసులు నమోదు కానున్నారు. అంతేగాక అల్లోపతిక్ ​ఆసుపత్రిలో ఆయుష్​ వైద్యులతో చికిత్సను అందించినా రూల్స్​ బ్రేక్​ చేసినట్లే అని వైద్యాధికారులు చెబుతున్నారు.

క్వాలిఫై డాక్టర్లు ఉండాల్సిందే.. డీహెచ్​డా జీ శ్రీనివాసరావు

ప్రైవేట్ఆ సుపత్రులు రిజిస్ట్రేషన్లు, క్వాలిఫైడ్ స్టాఫ్ లేకుంటే కఠిన చర్యలు ఉంటాయి. డయాగ్నస్టిక్ ​సెంటర్లు కూడా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. ఆసుపత్రిల్లో ఇల్లీగల్​ ఆబర్షన్లు చేస్తే చర్యలు ఉంటాయి. ప్రతి ఆసుపత్రిలో క్వాలిఫై డాక్టర్లు ఉండాల్సిందే. అర్హత లేకున్నా, క్లినికల్​సర్జరీలు చేస్తే క్రిమినల్​కేసులు ఉంటాయి. అదే విధంగా లైసెన్స్​జారీలో డబ్బులు ఆశీంచిన డీఎమ్​హెచ్‌ఓలపై కూడా చర్యలు తప్పవు.


Next Story