ఎన్టీఆర్ శతజయంతి మాసోత్సవాలు.. ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు నిర్వహణ

by Disha Web |
ఎన్టీఆర్ శతజయంతి మాసోత్సవాలు.. ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు నిర్వహణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 28 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గురువారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ స్మరణ ప్రతి తెలుగు వారి దిన చర్య గా, ఒక వేద మంత్రం గా మారి పోయిందన్నారు. ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అసోసియేషన్ ప్రెసిడెంట్ కనపర్తి రవి ప్రసాద్, జనరల్ సెక్రటరీ తుమ్మల రమేష్ నేతృత్వంలోని బృందం నిర్వహిస్తుంది. ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు.

Next Story