పేలుళ్లపై సింగరేణి అధికారులకు నోటీసులు!

by Disha Web Desk 4 |
పేలుళ్లపై సింగరేణి అధికారులకు నోటీసులు!
X

దిశ, గోదావరి ఖని: ఓసీపీ‌పై పేలుళ్లపై సింగరేణి ఆర్జీ వన్ అధికారులకు నోటీసులు అందాయి. బొగ్గు ఉత్పత్తిలో ఓబిని తీసేందుకు వాడే బ్లాస్టింగ్‌ల వల్ల కలుగుతున్న ఇబ్బందులపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు పెద్దెళ్ళి ప్రకాష్ గోదావరిఖని అదనపు జిల్లా కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. బ్లాస్టింగ్ వల్ల కాలుష్యంతో పాటు, దుమ్ము, ధూళి, పొగ, విషవాయువులు వెలువడుతున్నాయని, ఇల్లు కంపిస్తున్నాయని, గోడలు బీటలు వారుతున్నాయని పిల్ లో పేర్కొన్నారు. పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం)ను స్వీకరించిన కోర్టు ఆర్జీ వన్ జీఎం, కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్, పీసీ పటేల్ కంపెనీ, ప్రాజెక్టు అధికారికి బుధవారం నోటీసులు జారీ చేసింది.Next Story