లివింగ్ రిలేషన్ షిప్ కాదు.. ఇరిగేషన్ షిప్.. పొత్తులపై కాంగ్రెస్ సెటైర్

by Disha Web Desk 5 |
లివింగ్ రిలేషన్ షిప్ కాదు.. ఇరిగేషన్ షిప్.. పొత్తులపై కాంగ్రెస్ సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు కుదరబోతున్నదన్న ప్రచారం జోరుగా జరుగుతొంది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీల పొత్తుపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తొంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న లివింగ్ రిలేషన్ షిప్ కాస్త త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనుంది అంటూ.. కేసీఆర్, మోదీ ఫోటోలు పెట్టి, వాటికి ప్రేమతో రా.. సినిమాలోని ఏం అయ్యిందో ఏమో, నా మదిలో ఈ వేళ అనే సాంగ్ జత చేశారు.

అలాగే అధికారిక పొత్తులంట కాదా.. అనే క్యాప్షన్ ను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్టుని నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అంతేగాక అవునూ వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, అది రిలేషన్ షిప్ కాదు ఇరిగేషన్ షిప్ అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ఇలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బీఆర్ఎస్, బీజేపీల పెళ్లికార్డు అంటూ మ్యారేజీ ఇన్విటేషన్ కార్డు పోస్టు చేయగా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మరి నెటిజన్లు ఈ పోస్టుపై ఎలా స్పందిస్తారో చూడాలి.


Next Story

Most Viewed