నాంపల్లి కోర్టులో పవర్ కట్ లేదు! స్పందించిన TSSPDCL

by Disha Web Desk 14 |
నాంపల్లి కోర్టులో పవర్ కట్ లేదు! స్పందించిన TSSPDCL
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కరెంట్ కోతలు అనేవి లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా చెప్పిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణలో కరెంట్ కోతలు ఉన్నాయని ఆరోపిస్తున్నది. తాజాగా హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో కరెంట్ కట్ అయ్యిందని సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అయ్యింది. ఈ రోజు మధ్యాహ్నం కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుండగా పవర్ కట్ అయ్యిందని, దీంతో చీకటిలోనే జడ్జి వాదనలు విన్నట్లు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీంతోపవర్ కట్స్ విషయంలో రియాల్టీ ఇదని నెటిజన్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క‌కు ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేశారు. దీనిపై TSSPDCL (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) వెంటనే స్పందించింది.

నాంపల్లి కోర్టులో MCB ట్రిప్పింగ్ కారణంగా పవర్ కట్ అయ్యిందని తెలిపింది. ఇది అంతర్గత సమస్య అని కోర్టు ఎలక్ట్రీషియన్లు ధృవీకరించారని పేర్కొంది. ఈ ప్రాంతంలో లేదా దాని పరిసరాల్లో ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ స్పష్టం చేసింది. అదేవిధంగా కరెంటు కోతలు ఉండొచ్చని తెలంగాణ భవన్ అలెర్ట్ అయింది. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మధ్యలో కరెంటు పోతే ఇబ్బందులు వస్తాయని గ్రహించి ముందే జనరేటర్లను ఏర్పాటు చేసుకున్నారు.

Next Story