కేసీఆర్ సీఎం అయ్యాక ల్యాండ్ అసైన్డ్ కమిటీ లేవీ? Bhatti Vikramarka (భట్టి విక్రమార్క)

by Disha Web Desk |
కేసీఆర్ సీఎం అయ్యాక ల్యాండ్ అసైన్డ్ కమిటీ లేవీ? Bhatti Vikramarka (భట్టి విక్రమార్క)
X

దిశ,డైనమిక్ బ్యూరో: పోడు భూముల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయిందని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఆరోపించారు. దీని వల్ల అటు గిరిజనులు ఇటు అధికారులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఖమ్మంలో ఫారెస్ట్ అధికారి బలి కావడం బాధాకరం అన్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ అసైన్డ్ కమిటీలు ఉండేవని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క కమిటీ లేదు, కమిటీ మీటింగ్ లేదని మండిపడ్డారు. అసైన్డ్ మెంట్ కమిటీలను ఎత్తివేయడం వల్ల భూ పంపిణీ చేయాలని అనుకున్నప్పటికీ అర్హులైన వారు అప్లికేషన్లు పెట్టుకున్నా పరిష్కారం లేకుండా పోతోందన్నారు. గత ఎనిమిదేళ్లుగా భూమి సేకరించి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చుకునే పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వం తీరు వల్ల భూమి ఉన్న రైతులకు, భూమి లేనటువంటి రైతులకు కూడా ఇబ్బందులు వస్తున్నాయన్నారు. భూమిపై హక్కును కోల్పోయామనే బాధతో గిరిజనులు బాధపడుతున్నాన్నారు. అందువల్లే ఇవాళ్టి నుంచి భూ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోందన్నారు.

గురువారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో చదువుకుందామంటే ఫీజు రియింబర్స్ మెంట్ సమస్యలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలతో పాటు అనేక సమస్యలు నెలకొని ఉన్నాయన్నారు. మరో వైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ చేతులు ఎత్తివేశారన్నారు. అనేక ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ఒక కుట్ర పూరితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. సమస్యలపై ఆలోచనలు రానీయకుండా ప్రజలను, మీడియాను, మేధావులను, సామాజిక శాస్త్రవేత్తలను చివరకు రాజకీయ పార్టీలను కూడా పక్కదోవ పట్టించే వైనం చూస్తుంటే బాధేస్తోందన్నారు. ఈడీ ఒకరిపై దాడి చేస్తే ఐటీ మరొకరిపై దాడి చేస్తున్నాయని ఒక వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తుంటే.. మీరే తనిఖీలు చేస్తారా? మేము కూడా దాడులు చేస్తామంటూ స్టేట్ జీఎస్టీ రంగంలోకి దిగుతోందన్నారు. ఒక వేళ రెండు రోజుల పాటు దర్యాప్తు సంస్థల సోదాలు ఆపితే ఎక్కడ ప్రజలు ఆలోచనలో పడుతారో అని ఆ గ్యాప్ లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు బూతులు తిట్టుకుంటున్నారని ఆరోపించారు. నేతల మధ్య బూతులు సభ్యసమాజం హర్షించలేని స్థాయికే చేరుకున్నాయని, ప్రజా ప్రతినిధులే అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ తో మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.



Next Story

Most Viewed