పోలింగ్ కేంద్రంలోకి చిన్నారికి నో ఎంట్రీ.. మహిళా కానిస్టేబుల్ ఏం చేశారో తెలుసా..? (వీడియో)

by Rajesh |
పోలింగ్ కేంద్రంలోకి చిన్నారికి నో ఎంట్రీ.. మహిళా కానిస్టేబుల్ ఏం చేశారో తెలుసా..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ వేళ ఓ ఆసక్తికర ఇన్సిడెంట్ జరిగింది. మహబూబాబాద్ పట్టభద్రుల పోలింగ్ కేంద్రానికి చిన్నారితో ఓ మహిళ వచ్చింది. అయితే పాపను పోలింగ్ కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ చిన్నారిని కాసేపు ఆడించారు. మహిళ తన ఓటు హక్కును వినియోగించికున్న తర్వాత చిన్నారిని తీసుకుని వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు.

Next Story

Most Viewed