టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానం

by GSrikanth |
టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానం
X

దిశ, నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ కే. రవీందర్రావు(కరీంనగర్), వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి(నల్లగొండ)లపై అవిశ్వాస తీర్మానం పెడుతూ రాష్ట్ర బ్యాంకు డైరెక్టర్లు అధికారులకు లేఖలు అందజేశారు. రాష్ట్ర బ్యాంకులు మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉండగా అందులో చైర్మన్, వైస్ చైర్మన్ మినహాయిస్తే మిగిలిన ఏడు మంది డైరెక్టర్లు కూడా వాళ్లపై అవిశ్వాసం పెడుతూ సంతకాలు చేసినట్లు తెలిసింది. అయితే జూన్ 10న రాష్ట్ర బ్యాంకు కార్యాలయంలో అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Next Story