అయ్యో పాపం.. యువకుల చేతిలో తన్నులు తిన్న విద్యుత్ అధికారులు..

by Sumithra |
అయ్యో పాపం.. యువకుల చేతిలో తన్నులు తిన్న విద్యుత్ అధికారులు..
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామంలో విద్యుత్ అధికారులకు వింత పరిస్థితి ఎదురైంది. పోచంపల్లి గ్రామంలో దొంగ కరెంటు వాడుతున్నారంటూ విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, లైన్మెన్ సందీప్ లు అడగడమే పాపమైంది. పోచంపల్లి గ్రామంలో లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్ లను చింతలపల్లి గంగారెడ్డి, నవీన్ రెడ్డి అనే ఇద్దరు సోదరులు విచక్షణా రహితంగా కొట్టారు. దొంగ కరెంటు వాడుతున్నారా అని అడిగినందుకు అధికారుల పైనే చేయి చేసుకున్నారు. పోచంపల్లి గ్రామంలోని చింతలపల్లి గంగారెడ్డి గృహానికి సంబంధించిన బిల్లు 24 వేల పై చిలుకు నగదు చెల్లించవలసి ఉండడంతో గతంలోనే విద్యుత్ అధికారులు అతని విద్యుత్ కనెక్షన్ ను తొలగించారు.

దీనికి ఆ గంగారెడ్డి పక్కన గల విద్యుత్ మీటర్ల నుంచి విద్యుత్ వాడుకోవడంతో అధికారులు ఇది కరెక్ట్ కాదు బిల్లుచెల్లించి విద్యుత్ పునరుద్ధరించుకోవాలని సూచించారు. అలాగే గురురెడ్డి మీటర్ లేకుండా దొంగతనంగా కరెంటు వాడడంతో మీటర్ కోసం అప్లై చేయాలని అధికారులు చెప్పారు. ఈ రెండు సంఘటనలు ఉద్దేశించుకొని గంగారెడ్డి, నవీన్ రెడ్డిలు విద్యుత్ అధికారుల పై దాడి చేశారు. విద్యుత్తు కన్జ్మర్ల దాడిలో గాయపడ్డ అధికారులను ఆర్మూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విద్యుత్ అధికారుల పై దాడి చేసిన చింతలపల్లి గంగారెడ్డి నవీన్ రెడ్డిలను కఠినంగా శిక్షించాలని విద్యుత్ అధికారులు కోరారు. మమ్మల్ని కొట్టడంతో పాటు తన ఫోన్ ను కూడా తీసుకున్నారని పోచంపల్లి లైన్మెన్ సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed