మత్తులో యువత చిత్తు.. పట్టించుకోని అధికారులు

by Dishanational2 |
మత్తులో యువత చిత్తు.. పట్టించుకోని అధికారులు
X

దిశ.ముదిగొండ : ముదిగొండ మండలంలో యువతకు ఎక్కువగా మత్తు పనియాలు బానిస కావటంతో నేడు అది అతిపెద్ద సమస్యగా పరిణమించాయి. మద్యానికి బానిసలుగా మారటం ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత, జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు. చదువుకోవలసిన వయస్సులో చెడు వ్యసనాల బారిన పడుతూ యుక్తవయసులోనే అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే చేయిదాటే ప్రమాదం ఉంది. గంజాయి డ్రగ్ మాఫియాపై ప్రభుత్వాలు, పోలీస్‌శాఖ ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ,విద్యార్థుల జీవితాలను మత్తులో ముంచేస్తోంది.

ద్విచక్రా వాహనాలపై మద్యం సేవించి అతివేగం‌తో వాహనాలు నడుపుతూ ఎక్కువగా యువత రోడ్ ప్రమాదం‌లో చనిపోతున్నారు. దీని అంతటికి కారణం.. ఓటమిని తట్టుకోలేక, చదువులు బుర్రకు ఎక్కక, చెడు స్నేహాలు,వంటి అనేక కారణాల వల్ల వీరు వ్యసనాలకు అలవాటు పడి తమ విలువైన కాలాన్ని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని కోల్పోతున్నారని అంటున్నారు.

అయితే వీరు ప్రారంభంలో సరదాగా డ్రగ్స్‌ తీసుకొంటారు. లేదా ఎవరైనా వీరికి అలవాటు చేస్తారు.ఇలా ఈ విధంగా యువత మత్తులో చిత్తుగామారుతున్నారు. తల్లితండ్రులు నిరక్షరాశులుగా ఉండటమే దీనికి కారణమా, పిల్లల పట్ల సమయ పాలనా లేక వారిని పాటించుకోక పోవడం వల్ల యువత వ్యసనాలకు బానిసలు అవుతున్నారా..? చుదువు కొని ఉన్నత శిఖరాలకు చేరాల్సిన యువత ఎందుకు మత్తుకు బానిసలవుతున్నారు.

Next Story