మలేషియాలో చిక్కుకున్న యంచ గ్రామవాసి

by Disha Web Desk 15 |
మలేషియాలో చిక్కుకున్న యంచ గ్రామవాసి
X

దిశ,నవీపేట్ : బతుకుతెరువు కోసం 8 నెలల క్రితం మలేషియా వెళ్లిన మండలంలోని యంచ గ్రామానికి చెందిన నూనె రాజు ఏజెంటు చేసిన మోసం తో పనిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తినడానికి తిండిలేక, రావడానికి, డబ్బులు లేక తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెలుసుకున్న యంచ గ్రామ మాజీ ఉపసర్పంచ్ లాలు యాదవ్, ఎంపీటీసీ లలిత సంజీవ్ లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకెళ్లడం తో స్పందించిన కవిత అరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి స్వదేశానికి రావడానికి తగిన ఏర్పాట్లు చేయడంతో శుక్రవారం ఆయన ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా బాధితుడి రాజు భార్య అక్షయ, కూతురు నివేదిత, నాయకులు సంజీవ్, లాలు, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంటికి వస్తానని అనుకోలేదు....

ఏజెంట్ మోసం చేయడంతో మలేషియాలో చిక్కుకున్న తాను ఇంటికి వచ్చి కుటుంబాన్ని కలుస్తానని అనుకోలేదని, నా కుటుంబాన్ని కలిపిన ఎమ్మెల్సీ కవిత సహకారం మరవలేనని జీవితాంతం కవితకు ‌రుణపడి ఉంటానని రాజు తెలిపారు.Next Story

Most Viewed