నిజామాబాద్ జీజీహెచ్ లో దారుణం...రోగులకు పురుగుల ఆహారం

by Sridhar Babu |
నిజామాబాద్ జీజీహెచ్ లో దారుణం...రోగులకు పురుగుల ఆహారం
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రి కి వైద్యం కోసం వచ్చే రోగులకు వండి వార్చుతున్న భోజనంతో కొత్త రోగాలు సంక్రమిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వారి వెంట వచ్చే ఒకరికి భోజనం అందించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. దశాబ్దాలుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. ప్రతి రోగికి వైద్య ఆరోగ్యశాఖ నియమనిబంధన మేరకు మెనూ ప్రకారం భోజనం అందించాలి. కానీ నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఓకే కాంట్రాక్టర్ కు అరడజన్ ఆసుపత్రులు కాంట్రాక్ట్​ ఉండడంతో అక్కడ సబ్ కాంట్రాక్టర్లను పెట్టి భోజనాన్ని అందిస్తున్నారు. దాంతో రోగులకు అందించే భోజనం నాసిరకంగా మారింది. ఆస్పత్రిలో మెనూ ప్రకారం భోజనం అందడం లేదు అంతేగాకుండా రోగులకు పురుగుల అన్నం, కుళ్లిన కోడిగుడ్లతో అన్నం అందిస్తున్నారు.

ఈనెల 25న జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో సెక్యూరిటీ సేవలు అందిస్తున్న (సీఐ ఏస్ ఎఫ్) పోలీసులకు కూడా పురుగుల ఆహారం అందించారు. శనివారం కూడా రోగులకు పురుగుల అన్నాన్ని వండి వార్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పురుగుల అన్నం తో రోగులకు భోజనం పెడుతున్నారన్న విషయం బహిర్గతం కావడం ఆసుపత్రి అధికారులకు, కాంట్రాక్టర్​కు నచ్చలేదు. ఈనెల 25న ఆసుపత్రిలో ముందుగా పోలీసులు భోజనం చేసినప్పుడు ఈ విషయం వెలుగు చూసినప్పుడు ఫొటోలు తీశారని ఏకంగా ఎస్సై, సీఐ లతోపాటు సిబ్బందికి ఆసుపత్రి అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా సీఐఎస్ఎఫ్ కు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆస్పత్రిలో పురుగుల అన్నం, కుళ్లిన కోడిగుడ్లను పెడుతున్న

విషయం మీ ద్వారానే లీక్ అయిందని వారిపై చర్య తీసుకుంటామని బెదిరించడం గమనార్హం. అలాగే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రి కొందరికి సొంత జాగీరుగా మారింది. ఆస్పత్రిలో సరైన వైద్య సేవలు, సౌకర్యాలు అందడం లేదని ఫొటో తీసినా, వీడియోలు తీసినా ఆసుపత్రి అధికారులకు ఎక్కడా లేని కోపం వస్తుంది. ఈ విషయంలో ఫొటోలు తీసిన వారిని సమాచారం ఇచ్చిన వారిని వేధించడం నిత్య తంతుగా మారింది. సమాచార హక్కు చట్టం కోసం దరఖాస్తు చేసిన వారిపై కూడా కేసులు పెట్టిన చరిత్ర ఆసుపత్రి అధికారులది. ఆస్పత్రిలో అర్హత లేకున్నా కొనసాగుతున్న కొందరిని తొలగిస్తే కానీ ఆసుపత్రి బాగుపడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.

Next Story

Most Viewed