గాలి, వాన, ఈదురుగాలుల బీభత్సం

by Shiva Kumar |
గాలి, వాన, ఈదురుగాలుల బీభత్సం
X

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులుతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఇందులో ముఖ్యంగా గాంధారికి పద్మాజీవాడి నుంచి సరఫరా అయ్యే 11 కే.వీ వైర్లపై ఊదురుగాలులతో చెట్లు విరిగి పడటంతో గత మూడు గంటలుగా మండల కేంద్రంలో కరెంట్ లేకుండా పోయింది. విద్యుత్ శాఖ అధికారులు గుడిమెట్ వద్ద వైర్లపై పడిన చెట్లను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉండగా ఈదురు గాలులకు మండల కేంద్రంలోని జువ్వాడి గ్రామంలో మరిమల్ల భాస్కర్, మరిమల్ల సాయిలు ఇద్దరి రేకుల ఇళ్లు ఈదురు గాలులు బీభత్సానికి పైకప్పు పూర్తి ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story