ప్రజావాణికి ఈసారైనా అధికారులు వచ్చేనా..?

by Aamani |
ప్రజావాణికి ఈసారైనా అధికారులు వచ్చేనా..?
X

దిశ నిజామాబాద్ సిటీ : ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలో నిర్వహిస్తారు. ప్రజావాణికి ప్రభుత్వ శాఖలో పనిచేసే ముఖ్య అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజా సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించాలని సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రజావాణికి అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజావాణి కాస్త టైం పాస్ గా మాత్రమే అధికారులు వస్తూ వెళ్తూ ఉన్నారు. అందులో ముఖ్యమైన ఉన్నత శాఖ అధికారులు నెలల తరబడిగా ప్రజావాణి కి డుమ్మా కొడుతూ వారి సొంత పనుల కోసమే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పలుమార్లు అన్ని శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి కచ్చితంగా రావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కలెక్టర్ ఆదేశాలు మాత్రం వారి చెవికెక్కడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి తమ తమ సమస్యలను అధికారులకు తెలిపేందుకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అధికారులకు వినతులు అందిస్తారు. ప్రజల సమస్యలను పరిష్కరించే సంబంధిత అధికారులు మాత్రం ముఖ్యమైన ప్రజావాణికి గైర్ హాజరు కావడం పట్ల వారి నిర్లక్ష్యం ఎంత మటుకు ఉందో ఇట్టే అర్థమవుతుంది. గత కలెక్టర్లు ముఖ్యమైన ప్రజావాణికి హాజరుకాని వివిధ శాఖల ఉన్నతాధికారులకు ఎందుకు హాజరు కాలేదని వివరణ కానీ పూర్తిగా హాజరు కాని వారికి నోటీసులు జారీ చేసిన దాఖలాలు ఉన్నాయి.

కానీ ఎందుకు వీరి పట్ల అధికారులు మౌనంగా ఉంటున్నారు ప్రశ్నార్థకంగా ఉంది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రతివారం ప్రజావాణికి అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా వారి పనుల్లో నిమగ్నమై ఉండడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లాకు గుండెకాయగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై ప్రజలు నిత్యం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఉంటారు కానీ గత కొన్ని నెలల నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రజావాణికి డుమ్మా కొడుతూ ఆమె సొంత పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సోమవారం జరిగే ప్రజావాణికి అన్ని శాఖల ముఖ్య అధికారులు హాజరవుతారా.. హాజరుకాని అధికారులపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చర్యలు తీసుకుంటారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed