కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు.. వర్షాకాలం వస్తే ఆ ఊరుకు తప్పని అవస్థలు

by Anjali |
కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు.. వర్షాకాలం వస్తే ఆ ఊరుకు తప్పని అవస్థలు
X

దిశ, ఎల్లారెడ్డి: కాలం మారుతుంది.. ఆధునికత రోజురోజుకు విస్తరిస్తుంది. మారుమూల ప్రాంతాలకు సాంకేతిక పరిజ్ఞానం చేరుతున్నప్పటికీ ఇంకా ఆ గ్రామానికి ఇప్పటికీ, ప్రధాన రహదారి వేయకపోవడం ఆ గ్రామస్తుల దురదృష్టం. ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణానికి అంచునే ఉన్న ఆ గ్రామం ఎల్లారెడ్డి పట్టణానికి, రెండునర కిలోమీటర్ల దూరంలో ఉన్న, మౌలాన్ కేడ్ గ్రామం, ఆ గ్రామానికి, ఎల్లారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నుండి పెద్ద మసీదు పక్కన సోమార్పేట్ రహదారి మార్గ మధలో ఉన్న ఆ గ్రామం మౌలాన్ ఖేడ్. గ్రామం ఏర్పడి, సుమారు 50 సంవత్సరాల పైచిలుకు అయినప్పటికీ ఇప్పటివరకు ఆ ఊరి ప్రజలకు మట్టిరోడ్డే దిక్కు అవుతుంది. మా ఊరికి మట్టి రోడ్డును తప్ప బీటీ రోడ్డు రాదా, అని ఆ ఊరి ప్రజలు ఎన్నోసార్లు ఎన్నికల సమయంలో నాయకులు తమ గ్రామానికి ప్రచారానికి వచ్చినప్పుడు వేడుకున్నారు. ఎన్నికల సమయంలో ఆ ఊరికి వచ్చిన నాయకులు ఎన్నికల అనంతరం ఊరికి రహదారి మార్గం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పడం ఎన్నికలు అయిపోయాక రోడ్డు మార్గాన్ని మర్చిపోవడం పట్ల ఆ ఊరి ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్లారెడ్డి పట్టణం గుండా సోమార్పేట్ కు వెళ్లే రహదారి పక్కనే ఉన్నప్పటికీ ఆ గ్రామానికి బీటీ రోడ్ వేయకపోవడంలో ఆశ్చర్యం ఏమిటో అని ఆ గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ గ్రామంలో సుమారు 600 మంది జనాభా ఉన్నప్పటికీ ఆ గ్రామాన్ని నాయకులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఎంతోమంది శాసనసభ్యులకు ఆ గ్రామానికి బీటి రోడ్డు నిర్మాణంకు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ కు కూడా ఆ గ్రామస్తులు, రహదారి నిర్మాణం కోసం వినతిపత్రం అందజేసిన శూన్యమైపోయింది. నూతనంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త గ్రామపంచాయతీలో కూడా ఆ ఊరు నూతన గ్రామపంచాయతీగా పురుడు పోసుకుంది. నూతన గ్రామపంచాయతీ ఏర్పడి సుమారు ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఆ ప్రభుత్వ ఆయాంలో కూడా రహదారి కోసం పలు ప్రయత్నాలు చేసినా శూన్యమైనట్లు ఆ ఊరి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త ప్రభుత్వం పై కోటి ఆశలు..

కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులైనప్పటికీ ప్రస్తుత శాసనసభ్యులకు కూడా వినతి పత్రం అందజేశామని ఆ ఊరి గ్రామస్తులు పలువురు తెలిపారు. మరి కొత్త ప్రభుత్వం పరిపాలనలో ఆ ఊరికి రహదారి నిర్మాణం జరిగేనా. లేక అర్ధాంతరంగానే ఆగిపోవున అని ఆ గ్రామస్తులు కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పడుతున్నారు. నూతన పాలకులు స్పందించి తమ గ్రామానికి రోడ్లు నిర్మిస్తారని ఆ గ్రామస్తులు ఆశలు ఎదురుచూస్తున్నారు. రానున్న వర్షాకాలంలో రహదారిపై ఆ గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని ప్రజల బాధను పట్టించుకోని ఆ గ్రామానికి రహదారి నిర్మాణం త్వరగా చేయాలని ఆ ఊరి గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Next Story

Most Viewed