- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పోచారం రిజర్వాయర్,నాగన్న మెట్ల బావిని అభివృద్ధి చేస్తాం : మంత్రి జూపల్లి

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పోచారం రిజర్వాయర్,నాగన్న మెట్ల బావిని అభివృద్ధి చేస్తాం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగిరెడ్డి పేట మండలం పోచారం రిజర్వాయర్ ను ఏకో టూరిజం, వాటర్ బేస్డ్ రిక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? లింగంపేట గ్రామంలోని ప్రాచీన దిగుడు మెట్ల నాగన్న బావిని పునరుద్ధరించి పరిరక్షించడానికి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బదులిచ్చారు. పోచారం రిజర్వాయర్ ను ఎకో టూరిజం, వాటర్ బేస్డ్ రిక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. ప్రాచీన దిగుడు మెట్ల నాగన్న బావి అభివృద్ధి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. పోచారం రిజర్వాయర్, నాగన్న బావి అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, పోచారంలో రవాణ , బోటింగ్, పార్కింగ్, ట్రెక్కింగ్, చిన్న పిల్లల కోసం ఆటలు, నాగన్న బావి వద్ద ఫుడ్ కోర్టు, లైటింగ్, సీలింగ్ ఏర్పాటు, తదితర అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అడిగిన ప్రశ్నపై మంత్రి వివరించారు.