నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది స్థానాలు మావే

by Disha Web Desk 15 |
నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది స్థానాలు మావే
X

దిశ, ఆర్మూర్ : జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలను బీఆర్ ఎస్ కైవసం చేసుకుంటుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సరళిని పరిశీలించిన అనంతరం భీంగల్ లో ఆయన గురువారం మీడియా సమావేశం లో మాట్లాడారు. తొమ్మిది స్థానాల్లో ఏడు స్థానాలు మంచి మెజారిటీ తో రెండు స్వల్ప మెజారిటీ తో గెలుస్తున్నామని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గం లో పోలైన ఓట్లలో తనకు 55 పైబడి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తనపై, తన కుటుంబం పై ఎన్ని తప్పుడు ప్రచారాలు

చేసినా ప్రజలు పట్టించుకోకుండా తన వైపే నిలిచారని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసిన వారికి ఇది చెంపపెట్టు అవుతుందన్నారు. రాష్ట్రంలో 119 సీట్లకు గాను 80 సీట్లను బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గెలుపునకు దోహదం చేశాయని, మరో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు మంచి సేవలు అందజేస్తామని పేర్కొన్నారు. గెలిచిన తరువాత తాను కేసీఆర్ సైనికుడిలా ఉంటానని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చైర్మన్ డాక్టర్ మధు శేఖర్, మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్, మల్లెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed