గడప గడపకు వరంగల్ రైతు డిక్లరేషన్: జంగా నరసింహ

by Disha Web |
గడప గడపకు వరంగల్ రైతు డిక్లరేషన్: జంగా నరసింహ
X

దిశ, నందిగామ: తెలంగాణ రాష్ట్రంలో మే 6 న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించిన సందర్భంగా వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు డిక్లరేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నందిగామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా నరసింహ మాట్లాడుతూ .. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో చలో రచ్చబండ, గ్రామ గ్రామాన వరంగల్ రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 30 రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ ఏకకాలం తో పాటు 15 వేల రూపాయలు కౌలు రైతు వర్తింప చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నేతలు, వివిధ మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

Next Story