ఇంటి పన్నుల వసూలులో గ్రామపంచాయతీ సిబ్బంది..

by Disha Web Desk 20 |
ఇంటి పన్నుల వసూలులో గ్రామపంచాయతీ సిబ్బంది..
X

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి గ్రామపంచాయతీలో అధికారులు పన్నులను వసూలు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి గ్రామ కార్యదర్శి డి.గంగారం ఆధ్వర్యంలో ఇంటి పన్నులు, కులాయి పన్నులు, వృత్తి వ్యాపార లైసెన్స్, పన్నులను తమ సిబ్బందితో, ఇంటింటికి, తిరిగి పన్నులను వసూలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కారోబార్, డి.సాయిలు, వాటర్ మాన్, ఎండి. షాదుల్, గ్రామస్తులు పాల్గొన్నారు.


Next Story