ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై విద్యార్థి సంఘాల దౌర్జన్యంపై సీపీకి ఫిర్యాదు చేసిన ట్రాస్మా యూనియన్

by Mahesh |
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై విద్యార్థి సంఘాల దౌర్జన్యంపై సీపీకి ఫిర్యాదు చేసిన ట్రాస్మా యూనియన్
X

దిశ, నిజామాబాద్ సిటీ: ట్రస్మా ఆధ్వర్యంలో సుమారు 80 మందికి పైగా జిల్లా వ్యాప్తంగా పాఠశాల నిర్వాహకులు స్థానిక వంశీ హోటల్ లో సమావేశమయ్యారు. విద్యార్థి సంఘాల తాకిడి విషయంలో తమ సమస్యలను చర్చించుకుని సమిష్టి తీర్మానంతో ట్రస్మా జిల్లా అధ్యక్షులు రాస నిత్యానందం సారథ్యంలో విద్యార్థి సంఘాల దాడుల నుంచి పాఠశాలలను కాపాడాలని కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి వినతి పత్రం అందించారు. దానికి కమిషనర్ సానుకూలంగా స్పందించి, అపరిచిత వ్యక్తులు, విద్యార్థి సంఘాల వారు ఎవరైనా పాఠశాలలపై దాడి చేసినట్లయితే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే.. వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్ కోశాధికారి మధు, పట్టణ అధ్యక్షులు ధర్మరాజు కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి నాగరాజు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.Next Story

Most Viewed