ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 15 |
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : ఎస్పీ  శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని మల్లన్న గుట్ట వద్ద అశోక్ గార్డెన్లో ఈఎంఆర్ఐ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించక పోతే ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోతారన్నారు. త్రిబుల్ రైడింగ్ చట్టరీత్యానేరం అని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని, వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్​ తప్పకుండా పెట్టుకోవాలని సూచించారు. హైవేపై వెళ్లేటప్పుడు 80 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్తే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. రోడ్ సేఫ్టీ డీఎస్పీ చంద్రబాన్ మాట్లాడుతూ ప్రతిరోజూ 20 మంది కంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల ద్వారానే చనిపోతున్నారన్నారు. డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన వారికి ప్రథమ చికిత్స ఎంతో అవసరం అన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే ఘటన స్థలంలో ఉన్న వ్యక్తులు 108 లేదా 102 కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అన్యోన్య, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సదాశివ నగర్ సీఐ రామన్, ఎం వీ ఐశ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఐ వాణి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ రాధిక, ఎస్సై రాజేష్, ఏఎస్ఐ గంగాసాగర్, నరసయ్య, ఆయా మండలాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed