ఫోక్సో కేసులో ఒకరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష

by Disha Web Desk 15 |
ఫోక్సో కేసులో ఒకరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : ఒక చిన్న పాపని కిడ్నాప్ చేసి అత్యాచారం చేయబోయిన సంఘటనలో నేరం రుజువైన సందర్భంగా ఓ వ్యక్తికి ఫోక్సో కేసులో మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు కామారెడ్డి జిల్లా అడిషనల్ డిస్టిక్ సెషన్స్ జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంకు చెందిన పూసల కనకయ్య (55) 2022వ సంవత్సరంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేయడంతో పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో బుధవారం మూడు సంవత్సరాల కారా గార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో పీపీ శేషు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నరేష్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ విజయ్ చాకచక్యంగా వ్యవహరించి నిందితుడికి శిక్షపడేలా చేసినందుకు జిల్లా ఎస్పీ అభినందించారు.


Next Story

Most Viewed