నాటకీయ ఫక్కీలో చోరీ... రికవరీ

by Disha Web Desk 15 |
నాటకీయ ఫక్కీలో చోరీ... రికవరీ
X

దిశ, నవీపేట్ : పంట డబ్బులను డ్రా చేసి పక్కకు తిరిగే సరికి పక్కనే ఉన్న మహిళ తస్కరించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం మండల కేంద్రం తడగామ కాలనీకి చెందిన ఐలాపురంనకు చెందిన నడిపి పోశెట్టి కి చెందిన పంట డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయి. దాంతో మండల కేంద్రంలోని ఓ బ్యాంక్ లో రెండు లక్షలు డ్రా చేసుకొని కొత్త పాస్ బుక్ తీసుకునే క్రమంలో ఉండగా గుర్తు తెలియని మహిళ సినీ ఫక్కీలో దొంగతనం చేసింది. తన డబ్బులు చోరీ అయినట్లు గ్రహించిన బాధితుడు బ్యాంక్ మేనేజర్ సహాయంతో సీసీ ఫుటేజ్ పరిశీలించి అనుమానాదాస్పదంగా కనిపించిన మహిళ సంబంధికులకు సమాచారం అందించగా డబ్బులు రికవరీ చేసినట్లు తెలిపారు.

Next Story