మహిళ ప్రయాణికురాలిని దోచుకున్న దొంగ అరెస్ట్

by Disha Web Desk 7 |
మహిళ ప్రయాణికురాలిని దోచుకున్న దొంగ అరెస్ట్
X

దిశ, నిజామాబాద్ క్రైo : నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా ప్రయాణికురాలు దోచుకున్న మహిళను అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు. మంగళవారం నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్‌లొ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నవంబర్ 14న బోత్ మండలం చెందిన నల్ల అభినేత్రి, తల్లీ శకుంతల, తన కొడుకుతో కలిసి బాసరలో దేవగిరి రైలు ఎక్కేందుకు యత్నిస్తుండగా బ్యాగులో నుంచి బంగారం, నగదు ఉన్న కవర్ చోరీకి గురైంది. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

విచారణలో భాగంగా మంగళవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన అంజనా భాయ్ హత్గడే అనే మహిళను అరెస్టు చేశారు. అంజనా భాయ్ రైల్వే స్టేషన్ రైలు భోగిలలో పిన్నీసులు విక్రయిస్తూ జీవిస్తూనే.. అదును చూసి చోరికి పాల్పడిందని ఎస్ఐ తెలిపారు. ఆమె వద్ద నుంచి 72 గ్రాముల బంగారం ఆభరణాలు 50వేల నగదును రికవరీ చేసినట్లు ఎస్సై తెలిపారు. మహిళ ప్రయాణికురాలిని దోచుకుని పరారీలో ఉన్న అంజన భాయ్ మరో చోరీ కోసం వచ్చి చిక్కిందని ఎస్ఐ తెలిపారు. రైల్వే ఐడి పార్టీ కానిస్టేబుల్ గురుదాస్, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, వరలక్ష్మి, కానిస్టేబుల్ నజ్మా చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును చేదించారని ఎస్ఐ తెలిపారు.


Next Story