దేశానికి అన్నం పెట్టే స్థాయికి రైతులు ఎదగాలి - స్పీకర్ పోచారం

by Disha Web |
దేశానికి అన్నం పెట్టే స్థాయికి రైతులు ఎదగాలి - స్పీకర్ పోచారం
X

దిశ, బాన్సువాడ : దేశానికి అన్నం పెట్టే స్థాయికి రైతులు ఎదగాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలం సిద్దాపూర్ వద్దనూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన సాగునీటి శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులపై సూచనలను చేశారు. అనంతరం స్పీకర్ పోచారం మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలోని లక్షఎకరాలు నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నదని, ఇంకా మిగిలిన మెట్ట ప్రాంతంలోని భూములకు సాగునీరు అందించడానికి రూ. 120 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్, రూ.106 కోట్లతో జాకోర-చందూరు ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నామని అన్నారు. ఈ రెండు పథకాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ రెండు పథకాల ద్వారా ముప్పైవేల ఎకరాల వరకు సాగునీరు అందుతుందని, సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మించే పరిసరాలు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలని అయన తెలిపారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో అధిక ప్రయోజనం పొందేది లంబాడీలని, వచ్చే జూన్ నాటికి పనులు పూర్తయ్యే విదంగా వేగంగా రాత్రింబవళ్లు చేయాలని అధికారులకు, గుత్తేదారులకు సూచించారు. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గంలో మంజీరనది వెంట భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండాలని నాలుగు చెక్ డ్యాంలు నిర్మిస్తున్నాని, వ్యవసాయం చేయడానికి అవసరమైన మౌళిక సదుపాయాలను రైతులకు కల్పిస్తే అద్భుతమైన పంటలను పండిస్తారన్నారు. దేశానికి అన్నం పెట్టె స్థాయికి ఎదుగుతారని అయన తెలియజేశారు.

రైతులు కూడా ఆర్ధికంగా బలపడుతారన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూమికి సాగునీరు అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ప్రాజెక్టులను రూపొందించారని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, దింది ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయని, ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో మొత్తం రెండు కోట్ల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కోటి యాబై లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు.

వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతులకు అవసరమైన పథకాలతో భరోసా కల్పిస్తున్నారని, ఈ ఆలోచనలు కొంతమందికి అర్ధంకాక విమర్శలు చేస్తున్నారు. బూతులు తిడుతున్నారని, మీరు పరిపాలించే రాష్ట్రాలలో కరువు వచ్చింది. మీ దగ్గర నదులలోని నీటిని వాడుకోలేక వృదాగా వదిలేస్తున్నారని విమర్శించారు. మీరు మంచి పనులను చేయరు, చేసే ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నాలు చేస్తారని బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రభుత్వాలను పడగొట్టడం కాదు రైతులను నిలబెట్టే పనులు చేయండని హితవు పలికారు. దేశ ప్రజల సంపద పెరగాలి, అంతేకానీ ఇద్దరు‌ ముగ్గురు పారిశ్రామిక వేత్తల సంపద మాత్రమే పెరగాలి అనేది తప్పని అయన ఏద్దేవా చేశారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed