పదవులు సీనియారిటీకా, పనిచేస్తున్న వారికా, ఫిరాయింపు అయిన నాయకులక.....?

by Kalyani |
పదవులు సీనియారిటీకా, పనిచేస్తున్న వారికా, ఫిరాయింపు అయిన నాయకులక.....?
X

దిశ, గాంధారి : స్కూల్ అడ్మిషన్లు ఒక నెల, ఒక వారం, పది రోజుల ముందు అడ్మిషన్లు ప్రారంభించడం సహజం. కానీ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎప్పుడు ఒంటరిగా కనిపించిన ఎమ్మెల్యే చెవులు ఒక మాట వేసి ఉంచుదాం అనే ధోరణితో నాయకుల ఖాళీగా ఉన్న పదవుల కోసం ముందస్తుగా అడ్మిషన్లను ఎమ్మెల్యేకు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. అయితే అధికార పార్టీగా ఉండి నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న పదవుల కోసం ఎమ్మెల్యే చుట్టూ పలువురు నాయకులు ప్రదక్షిణలు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉన్న మదన్ మోహన్ గుప్పిట్లో 8 మండలాలైన రామారెడ్డి,లింగంపేట్ నాగిరెడ్డిపేట్, గాంధారి, ఎల్లారెడ్డి ,సదాశివనగర్, తాడ్వాయి, రాజంపేట మండలాలలో గల సర్పంచ్, మార్కెట్ కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, ప్రాథమిక వ్యవసాయ శాఖ చైర్మన్ వివిధ శాఖలకు సంబంధించిన పదవులు దక్కించుకునేందుకు నువ్వా నేనా అంటూ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూ ఎమ్మెల్యే చెవిలో వేస్తూ చాలా బిజీగా ఉన్న నాయకులు చివరికి ఎవరికి ఏ పదవి లభిస్తుందో లేక సీనియారిటీ పరంగా ఇస్తారో.... లేక కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులను గుర్తించి వారికోసం పనులను కట్టబెడుతుందో అనేది సర్వత్రా అందరి నోట చర్చనీయాంశంగా మారింది.

మదన్ మోహన్ గెలుపు కోసం అహర్నిశలు తపించిన నాయకులను ఆదరిస్తారా లేదా వేరే పార్టీ నుంచి ఫిరాయింపు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నిన్న మొన్న వచ్చిన నేతలను ఆదరిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.....! ఇప్పటికే చాలామంది నాయకులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ క్షణం తీరిక దొరికిన అదే ఛాన్స్ ను అదునుగా చేసుకొని తనకు ఈ పదవి ఇస్తే బాగుండు అని అతని చెవిలో వేస్తున్నారని వినికిడి... ఇంకొందరు మండలంలో నేను తిరిగాను కాబట్టి ఆ పూర్తి ఓట్లు వచ్చాయని ఎమ్మెల్యే ముందు ఎవరు డబ్బు వారు కొట్టుకుంటున్నారు.... చివరికి ఎలా అవుతుందో ఎమ్మెల్యే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది ఆశ్చర్యపరుస్తూ వస్తుంది. ఎమ్మెల్యే చేతిలో ఉన్నటువంటి పదవులు దక్కించుకునేందుకు చాలామంది నాయకులు ఎమ్మెల్యే ఎటువైపు వెళ్తే అటువైపు వెళుతూ చాలా బిజీగా ఉన్నారు. అందరూ అడ్మిషన్లు అయిపోయాయి కాకపోతే ఫైనల్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకోసం అహర్నిశలు కూడా పాటుపడుతున్నారు.



Next Story

Most Viewed