గులాబీ జెండా ప్రజల గుండె చప్పుడు.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

by Disha Web Desk 13 |
గులాబీ జెండా ప్రజల గుండె చప్పుడు.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సామాన్య వ్యక్తులు కాదని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మహాశక్తులని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని ఎస్ఎస్‌కే ఫంక్షన్ హాలులో పార్టీ ప్రతినిధుల మహాసభ జరిగింది. సభా వేదిక వద్ద ఆయన గులాబీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. బీఆర్ఎస్ త్యాగాల పునాదిపై కట్టిన రాజకీయ సౌధమని, గులాబీ జెండా ప్రజల గుండె చప్పుడు అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే వన్నె తెస్తున్న కీర్తి కిరీటాలు అని, కేసీఆర్ ఉద్యమ నేతగా చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడు అన్నారు.

మళ్ళీ గెలిచేది మన బీఆర్ఎస్సే నని, మూడో సారీ సీఎం కేసీఆరే , కనివిని ఎరుగని అభివృద్ధి పథకాలతో ఆర్మూర్ రూపురేఖలే మార్చానని, ఆర్మూర్ ప్రజల దీవెనలతో మళ్లీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తా అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ల విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. పసుపు బోర్డు ఎగ్గొట్టి పంగనామాలు పెట్టిన ఎంపీ అరవింద్ ని ఇంటికి సాగ నంపాలన్నారు. ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మితే రైతుబంధు మాయమైవుతుందన్నారు. మన సింగరేణి ఆదానీ పాలవుతుందని జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఇంచార్జి బండ ప్రకాష్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎల్‌ఎంబి. రాజేశ్వర్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed