ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం..

by Disha Web Desk 13 |
ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం..
X

దిశ, గాంధారి: ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైన ఘటన తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని తిమ్మాపూర్ గ్రామంలో నడిపి గంగారం గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమైంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో రెండు తులాల బంగారం, మూడు తులాల వెండితోపాటు రెండు లక్షల నగదు ఉందని కుటుంబీకులు తెలిపారు. చేనులోకి వెళ్లి పనులు చేసుకుంటుండగా స్థానికులు చెప్పేంతవరకు మాకు తెలియదని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటికే సగం కాలిపోయిన తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పడం జరిగిందన్నారు. తమను ప్రభుత్వ ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story