తహసిల్దార్ కు చుక్కలు చూపిన మాజీమంత్రి

by Disha Web |
తహసిల్దార్ కు చుక్కలు చూపిన మాజీమంత్రి
X

దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం తహసిల్దార్ శ్రీనివాస్ రావుకు మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ చుక్కలు చూపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై గురువారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తహసిల్దార్ కార్యాలయం ముందు ఆయన బయట నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ధరణి భూ సమస్యలు ఎదుర్కొంటున్న బాధిత రైతులు తరలివచ్చా రు. ఈ సందర్భంగా బాధ్యత రైతులు తమ గోడును మాజీ మంత్రి షబ్బీర్ లతో విన్నవించుకున్నారు. తాసిల్దార్ కార్యాలయం ఆవరణలోనికి చేరుకోగానే ఎమ్మార్వో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

కార్యాలయం పని వేళలో కాకుండా కేవలం రెండు గంటలు పనిచేసే వెళ్ళిపోతావా అంటూ మహమ్మద్ అలీ షబ్బీర్ నిలదీశారు. రిజిస్ట్రేషన్ లపై సంతకాలు పెట్టి జేబులు నింపుకొని వెళతావా అంటూ ఆగ్రహం వెలుగుచ్చా రు. బాధ్యత రైతులు అందజేసిన పత్రాలను పాసుబుక్కులను చూపెడుతూ భవాని పేట పోతారం గ్రామాలకు చెందిన రైతుల నుంచి 40,000 ఒకరు 20,000 లంచం తీసుకోలేదా అంటూరు. హెడ్ క్వార్టర్ ఎందుకు మెయింటైన్ చేస్తలేరు అంటూరు. మీ ఇష్టం వచ్చిన సమయంలో విధులకు హాజరైతే రైతుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఇప్పుడే జిల్లా కలెక్టర్ తో చీఫ్ సెక్రటరీ తో మాట్లాడుతానని ఆయన హెచ్చరించారు. అనంతరం రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు.

Next Story

Most Viewed