- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించిన 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తాం : మదన్మోహన్ జా

దిశ, ఆర్మూర్ : తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకుని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని బీహార్ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్సీ, సీడబ్ల్యుసీ మెంబర్ మదన్మోహన్ జా అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల రాజారాం నగర్ కాలనీలో సోమవారం ఇటీవల హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు పథకాలకు సంబంధించిన కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్స్ లను సీడబ్ల్యుసీ మెంబర్, బీహార్ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ మదన్మోహన్ జా, స్థానిక ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు 6 గ్యారంటీస్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుక్కుగూడ సభలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించిన 6 గ్యారంటీస్ పథకాలను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్కాగా అమలు చేస్తుందన్నారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ఆనాడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్వరాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విషయం ఈ సందర్భంగా మదన్మోహన్ జ గుర్తుచేశారు. అనంతరం రాజారాం నగర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించిన పథకాల గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తూ.. పథకాల గురించి కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు తహెర్ బిన్ హుందాన్, పీసీసీ మాజీ అధికార ప్రతినిధి మార చంద్ర మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ మెంబర్ కోల వెంకటేష్, గోదావరి హైబ్రిడ్ సీడ్స్ అధినేత కూనింటి మహిపాల్ రెడ్డి , ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ , సత్యనారాయణ, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ హబిబ్, ఫ్లోర్ లీడర్ మహముద్ అలీ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు కాళ్లగడ్డ శ్రీకాంత్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు వేణురాజ్, నాయకులు అఖిల్, భూపేందర్, సైవే రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.