ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు అదృశ్యం

by Sridhar Babu |
ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు అదృశ్యం
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని మాలపల్లికి చెందిన 7 సంవత్సరాల బాలుడు కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు తెలిపారు. గత నెల 30న మాల పల్లికి చెందిన మహ్మద్ సల్మాన్ వాహజ్ అలియాస్ మినాజ్ ( 7) తన ఇంటి ముందు తోటి పిల్లలతో ఆడుకునేందుకు వేళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఈ మేరకు అతని తండ్రి మహ్మద్ అయాజ్ స్థానిక ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా సల్మాన్ ఆచూకీ లేకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.

Next Story

Most Viewed