విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోండి: కలెక్టర్ జితేష్ వి పాటిల్

by Disha Web Desk 11 |
విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోండి: కలెక్టర్ జితేష్ వి పాటిల్
X

దిశ, కామారెడ్డి: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ 2,3,4 ప్రత్యేక ఫౌండేషన్ కోర్స్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రణాళిక బద్ధంగా విద్యార్థులు పోటీ పరీక్షలకు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని తెలిపారు.

ఇష్టపడి చదివి తమకు నచ్చిన ఉద్యోగాన్ని పొందాలని చెప్పారు. ఎస్సీ నిరుద్యోగులు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిష్టయ్య, జిల్లా ఇంచార్జి షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, ఎస్సీ వసతి గృహం సంక్షేమ అధికారి నాగరాజు, శిక్షకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed