చిన్నారులను హడలెత్తిస్తున్న వీధి కుక్కలు

by Aamani |
చిన్నారులను హడలెత్తిస్తున్న వీధి కుక్కలు
X

దిశ,ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్ కొటార్ మూర్ ఏరియాలోని అన్ని వార్డుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో కుక్కలు స్వైర విహారం చేయడంతో పట్టణ పరిధిలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ లోని ఏ వార్డులో చూసిన వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. దీంతో చిన్నారులు బయటకు వెళ్లాలంటే హడాలెత్తు తుండడంతో పాటువారిని బయటకు పంపాలంటే తల్లిదండ్రులు జంపుతున్నారు. బయటకు పంపిన చిన్నారులు మళ్లీ తిరిగి ఇళ్లకు ఏ రీతిన వస్తారని తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఏరియాలో గల వెంకటేశ్వర కాలనీలో బుధవారం ఆరుగురు చిన్నారులకు వీధి కుక్కలు దాడిచేసి విచక్షణా రహితంగా గాయాలు చేశాయి.

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేసిన సంఘటనలు చూసి చూడడానికే భయంకరంగా తయారైందని ఆర్మూర్ వాపోతున్నారు. ఎన్ని సంఘటనలు జరిగినా ఆర్మూర్ మున్సిపల్ పాలకులు.. అధికారులు పట్టించుకోరా మున్సిపల్ వాళ్ళు ఉండి ఎందుకు ఏం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో వీధి కుక్కలను విశంపెట్టి చంపేవాళ్లు కదా ఇప్పుడు ఏమైంది మరి ఎందుకు పట్టించుకోవడంలేదని ఊర కుక్కలు ఆర్మూర్ మున్సిపల్ పురవీధుల్లో వీర విహారం చేస్తుంటే చిన్నారులు బయటకు రావడానికి భయపడుతున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలను ప్రజలు గుప్పిస్తున్నారు.

అసలు ఇంతకు ముందు మున్సిపల్ పాలకులు ఏం చేస్తున్నట్టు.. ప్రస్తుతం ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు.. ఓట్ల కోసం ఇండ్లకు వస్తారు కదా ఇలా ప్రజలకు ఇబ్బందులు పెడుతున్న కుక్కలను పట్టించుకోరా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆర్మూర్ మున్సిపల్ లో విపరీతంగా పెరిగిన వీధి కుక్కలు ఎందరి పిల్లల ప్రాణాలు తీయాలో మరి ఇదే మున్సిపల్ పాలకుల పిల్లలకు.. అధికారుల పిల్లలకు జరిగితే తెలుస్తుంది కావచ్చు అని జనం కోడై కూస్తున్నారు. ప్రస్తుతమున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోతే ఇంకా ఇలాంటి సంఘటనలు ఆర్మూర్ మున్సిపల్ లో ముందు రోజుల్లో ఎన్ని జరుగుతాయో ఎన్ని చూడాల్సి ఉంటుందో అని ప్రజలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు

పెరగకుండా నియంత్రించేలా చూస్తా : రాజు, మున్సిపల్ కమిషనర్, ఆర్మూర్

ఆర్మూర్ మున్సిపల్ లో వీధి కుక్కలను అరికట్టడం కోసం ఏబీసీకి విన్నవించాం. ఆర్మూర్లో విపరీతంగా పెరిగిన వీధి కుక్కలను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి పెరగకుండా నియంత్రించేలా చూస్తా. గత సంవత్సరం నుంచి ఆర్మూర్ లో 33 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశాం. కుక్కలను అరికట్టడానికి ఆర్మూర్ మున్సిపల్ లో పది లక్షల నిధులను గత పాలకవర్గంలో కేటాయించాం. ఆ నిధులతో ఏడాదిగా ఏబీసీ ద్వారా వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నాం. ఇప్పుడు మరింతగా విస్తృతం చేసి కుక్కల వ్యాప్తి చెందకుండా చూస్తాం. ఆర్మూర్ మున్సిపల్ లో సుమారుగా ఏడాదిగా కమిషనర్ గా పనిచేస్తున్న. ఇప్పటి వరకే వీధి కుక్కల విషయంలో నాపై ఒక కేసు నమోదయింది. జంతు సంరక్షణ చట్టం ప్రకారం జంతువులను చంపడం నేరం. వాటికి సంతతి పెరగకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడమే మన ముందున్న పద్ధతి. కోటార్ మూర్లోని డంపింగ్ యార్డ్ ఏరియాలో పక్క ఏరియాలోని వాళ్లు విపరీతంగా కుక్కలను వదిలి వెళ్తున్నట్లు తెలిసింది. అలా వదిలి వెళ్ళకుండా ఇక ముందు చర్యలు తీసుకుంటాం.

Next Story

Most Viewed