- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
అడుగు తీసి అడుగేస్తే అణచివేత
దిశ ,ఆర్మూర్ : అడుగు తీసి అడుగేస్తే అణచివేత అమలు చేస్తున్నారని,అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలోనూ చిట్టి నాయుడి పాలనలో జై తెలంగాణ అంటే అరెస్టులు చేసి జైళ్ళపాలు చేస్తున్నారని శుక్రవారం జీవన్ రెడ్డి దిశతో మాట్లాడారు. అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడానికి కూడా ఇన్ని ఆంక్షలా ?. రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించకుండా నిర్భందించడాన్ని ప్రజాపాలన అంటారా?. ఇందిరమ్మ రాజ్యమంటే ఇంతగా ప్రజలను హిసించడమా? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ నోటి వెంట నీతులు, రేవంత్ రెడ్డి నోటి వెంట బూతులు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా హక్కులను కాలరాస్తోందన్నారు. 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి ఆ మహనీయుని స్ఫూర్తిని భావితరాలకు పంచిన చరిత్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ది అయితే ఆ విగ్రహానికి నివాళులు అర్పించకుండా అంబేద్కర్ ప్రతిష్టను మసకబార్చే పన్నాగం రేవంత్ రెడ్డిది అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ నేతలు, శ్రేణులను అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లకుండా చేసిన కాంగ్రెస్ సర్కారు దాష్టికాలు, అక్రమ గృహ నిర్బంధాలు,తప్పుడు కేసులు, చట్టవ్యతిరేకమైన అరెస్టులను చూసి తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల హౌస్ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. 'హస్తం' పాలన ప్రశ్నిస్తే లోపలేస్తం అన్నట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే బాసిజం, ఫాసిజం అన్నట్టుగా ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటేనే అణచివేత,అవినీతి మేత, అబద్దాల రోత అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇన్ని అరాచక చర్యలే ఇందిరమ్మ రాజ్యం ప్రత్యేకతలా? అని ఆయన మండిపడ్డారు. పోలీసు పాలనతో బీఆర్ఎస్ ప్రజా ఉద్యమాన్ని అడ్డు కోలేరని ఆయన హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫాసిస్టు చర్యలను అడ్డుకుంటామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.