స్నేహితుడి కుటుంబానికి ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల చేయూత

by Dishanational4 |
స్నేహితుడి కుటుంబానికి ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల చేయూత
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని గోవింద్ పెట్‌లో శృంగారం శ్రీనివాస్ మృతి చెందడంతో తనతో చదువుకున్న మిత్రులు చేయూతగా నిలిచారు. 1999 -2000 ఎస్ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆర్థిక సహయం అందజేశారు. 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన సతీమణి, కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. తమ పూర్వ ఎస్ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన తోటి విద్యార్థి చనిపోవడంతో ఆయన సతీమణి కుటుంబ సభ్యులకు పూర్వ విద్యార్థులు అందరం కలిసి ఆర్థిక సాయం చేశామని, భవిష్యత్తులో సైతం ఆ కుటుంబానికి భరోసాగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు అప్పాల గణేష్ రెడ్డి, నర్సారెడ్డి, ఎస్. సాయేందర్, అబ్దుల్ ముబీన్, శివ, మారుతి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed