క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలి : కలెక్టర్ జితేష్ వి పాటిల్

by Shiva |
క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలి : కలెక్టర్ జితేష్ వి పాటిల్
X

దిశ, కామారెడ్డి రూరల్ : జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ జిల్లా స్థాయి కబడ్డీ, ఖోఖో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ... క్రీడాకారులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. గెలుపు, ఓటములను రెండింటినీ సమానంగా స్వీకరించాలని తెలిపారు. నేటి ఓటమి రేపటి గెలుపు నకు నాంది పలుకుతోందని హితవు పలికారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. సీనియర్ సిటిజన్ ఫోరంలో టేబుల్ టెన్నిస్ క్రీడలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఎస్.జీ.ఎఫ్ కార్యదర్శి రసూల్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story