మంజీరాలో ఇసుక దొంగలు.. రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమ రవాణా!

by Dishanational4 |
మంజీరాలో ఇసుక దొంగలు.. రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమ రవాణా!
X

దిశ, బీర్కూర్: బీర్కూర్ మండలంలోని బీర్కూర్, కిష్టాపూర్, దామరంచ, బరంగేడి గ్రామాలలో వేబిలులు లేకుండా రాత్రింబవళ్లు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాల పేరు చెప్పి మంజీరాలో ఇసుకను తవ్వేస్తున్నారు. ఇటు రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అంటి ముట్టనట్టు వ్యవహారిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లు నడిపే డ్రైవర్‌లో సగం మంది మైనార్లు ఉండటం గమనార్వం.

ఇలాగే అక్రమ ఇసుక రవాణా చేస్తే భూగర్భ జలాలు తరిగిపోయే అవకాశం ఉంది. రైతులు బోర్లు ఎక్కడ ఎత్తివేస్తామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్లు ఎత్తివేస్తే మా పంటలు ఎండిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed