ఆ జిల్లా విద్యార్థులకు శుభవార్త.. మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు

by Disha Web Desk 13 |
ఆ జిల్లా విద్యార్థులకు శుభవార్త.. మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు నూతనంగా బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (ఉమెన్), బీసీ రెసిడెన్షియల్ స్కూల్(బాయ్స్), బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నూతనంగా మంజూరైన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లాకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ (గర్ల్స్) మంజూరు అయిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ 296 ఉండగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా 542 రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశారన్నారు. అలాగే తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 161 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండగా వాటిని 280 కి పెంచారు. ఈ సందర్భంగా అడగగానే మంజూరు చేసిన సీఎం కేసీఆర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌లకు ఉమ్మడి జిల్లా ప్రజల పక్షాన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.


Next Story

Most Viewed