పోలీస్ లకే టోపిపెట్టిన దళారులు..

by Disha Web Desk 20 |
పోలీస్ లకే టోపిపెట్టిన దళారులు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రిజిస్ర్టేషన్ శాఖ అడ్డాగా జరిగిన అక్రమాలు అన్ని ఇన్ని కావు.. సబ్ రిజిస్ర్టార్ లు, సినియర్ అసిస్టెంట్ లు పని చేసిన సమయంలో జరిగిన అక్రమ రిజిస్ర్టేషన్ ల వ్యవహరం ఓక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రిజిస్ర్టేషన్ వ్యాల్యూను తక్కువగా చూపి కోట్ల రూపాయల ప్రభుత్వాదాయానికి గండి కొట్టిన విషయం తెలిసిందే. రెవెన్యూ, రిజిస్ర్టేషన్ ల శాఖలో పని చేసేవారు, దళారులు ఎకమై రిజిస్ర్టేషన్ శాఖను అడ్డగా చేసుకుని ఆక్రమ రిజిస్ర్టేషన్ లు చేశారు. ఆక్రమాలకు పాల్పడుతున్నఇంచార్జ్ సబ్ రిజిస్ర్టార్ లకు సంబంధిత శాఖ బాస్ ల అండతో కేసులు ఐనా పర్వాలేదు, సస్పెండ్ చేసిన జంకేది లేదన్నట్లు వ్యవహరాలు ఇప్పటికి జరుగుతున్న విషయం విదితమే. పోలిస్ అధికారులు కోందరు బినామీలుగా రియల్ దందాలో కాలు పెట్టి నిండా మునిగిన వ్యవహరం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కొననాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉసిపోయిందనే సామేత నిజామాబాద్ లో పనిచేసిన కొందరు పోలిస్ అధికారులకు అతికినట్లు సరిపోతుంది. నిజామాబాద్ లో రియల్ భూంను సొమ్ము చేసుకునేందుకు దళారులతో కలిసి దందా చేసేందుకు యత్నించి చేతులు కాల్చుకున్నారు. రెవెన్యూ అధికారులకు తోడు రిజిస్ర్టేషన్ అధికారులు కలిసి రావడంతో తాము పెట్టినపెట్టుబడికి 40 ఎకరాలు కలిసి వస్తాయని అశపడగా వారి అశలు అడియాసలు అయ్యాయి. తాము పెట్టిన పెట్టుబడి రూ.50 లక్షలు తిరిగి వస్తే చాలనకుంటే భూముల అక్రమ రిజిస్ర్టేషన్ వ్యవరం బహిర్గతం అయి సబ్ రిజిస్ర్టార్ సస్పెన్షన్ కావడంతో, దళారులు ప్లేట్ ఫిరాయించడంతో పెట్టుబడి పెట్టిన ఎలా రాబట్టుకోవాలో తెలియక సతమత మౌతున్నారు. అయాచీతంగా వచ్చిన సొమ్మును రియల్ దందాలో పెట్టుబడి పెడితే రాబోయే కాలంలో కాసులు కురిపిస్తాయనుకుంటే కథ అడ్డం తిరుగడంతో డబ్బులు విషయంతో పోలిస్ అధికారులు తేలుకుట్టిన దొంగలు మాదిరిగా మిన్నకుండిపోయారు.

నిజామబాబాద్ నగరంలోని ఒక లీడర్ కు తోడుగా అతని అనుచరులైన నాగారంకు చెందిన ఒక్కరు, గాయత్రి నగర్ కు చెందిన మరో దళారి తోడుగా నిజామాబాద్ లోరియల్ దందాకు తెరలేపారు. నగరంలోని దుబ్బ, గంగాస్ధాన్ ఫేస్ 1, బైపాస్ రోడ్డులోని టీచర్స్ కాలనీలో ఉన్న భూములపై కన్నేశారు. ఆయా భూములకు కొన్నింటికి యజమానులు లేని వాటిని , మరి కొందరు సంబంధిత భూముల యజమానుల తాలుకు వారసులను కలిపి డబుల్ రిజిస్ర్టేషన్ లకు తెరలేపారు. వారికి అందులో 40 ఎకరాల వరకు భూములు ఉన్నాయని వాటిని రిజిస్ర్టేషన్ చేసుకుంటే భవిష్యత్తు బాగుటుందని నిజామాబాద్ లో పని చేసి వివిధ ప్రాంతాలలో బదిలీ ఐన వారిని బుట్టలో వేసుకున్నారు.

అందులో నిజామాబాద్ రూరల్ లో, భీంగల్ లో పనిచేసిన ఇద్ధరు సీఐలు, మరో ముగ్గురు కలిసి రూ.50 లక్షలు దళారుల చేతిలో పోశారు. వాటిని తీసుకున్న ముగ్గురు సూత్రదారులు వాటితో గతంలో నిజామాబాద్ లో పనిచేసిన తహసీల్థార్, సబ్ రిజిస్ర్టార్ ల ద్వార భూముల రిజిస్ర్టేషన్ చేశారు. దుబ్బలో కబ్జా కువేళ్లేసరికి యజామానికి వారసులు లేని విషయం బహిర్గతం కాగా స్థానిక మూడో టౌన్ పోలిస్ స్టేషన్ లో రిజిస్ర్టేషన్ చేసిన సబ్ రిజిస్ర్టార్ తో పాటు మరో ఇద్ధరిపై కేసులు నమోదు అయ్యాయి. టిచర్ కాలనీలో కాలని వాళ్లు పెన్సింగ్ వేసుకోవడంతో అక్కడ వారి ప్రయత్నం బెడిసి కొట్టింది. గంగాస్ధాన్ ఫేస్ 1 లో వారికి చుక్కెదురైంది.

మూడు ప్రాంతాలలో 40 ఎకరాలకు ఎసరు పెట్టిన ఒక నేత ఇద్ధరు దళారులు ఈ వ్యవహరం బహిర్గతం ఐనప్పటికిని బాగానే మెనేజ్ చేశారనే వాదనలు ఉన్నాయి. సంబంధిత కేసులో సస్పెండ్ ఐన సీనియర్ అసిస్టేంట్ మళ్లి విధుల్లో చేరడం విశేషం. డబుల్ రిజిస్ర్టేషన్, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన జిల్లా అధికార యంత్రాంగం, రిజిస్ర్టేషన్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పెద్ధగా విస్మయం కలిగించలేదు. ఎందుకంటే ప్రతి దందాలో పర్సెంటేజ్ లు అశించే ప్రజా ప్రతినిధి ద్వార మని మేనేజ్ చేసినట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే శాఖలోని కొందరు సేమ్ బ్యాచ్ మెంట్ అధికారుల ద్వార వాటిని తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇటివల ఇద్ధరు దళారులకు వార్నింగ్ ఇచ్చి రెపో మాపో వారిని లైన్ లోకి తీసుకుని వసూలు చేసుకునే పనిలో పడినట్లు సమాచారం.


Next Story

Most Viewed